24, ఫిబ్రవరి 2017, శుక్రవారం

విచారణ

సహజపండితుడైన బమ్మెర పోతన రచించిన భాగవతంలో క్రింది పద్యమును పరిశీలించిన అనేక విషయాలు కనబడతాయి.

గజేంద్రమోక్షంలో మొసలిచే పీడింపబడుచున్న గజేoద్రుడు మొర పెట్టుకొను సందర్భంలోని పద్యమును చూడుడు.

కం||నర్తకునిభంగి బెక్కగు 

        మూర్తులతో నెవ్వడాడు?మునులు దితిజులుం 

        గీర్తింప నేర?రెవ్వని 

        వర్తనమొరులెఱుగ రట్టివారి నుతింతున్.

 ఎనుబది నాలుగు లక్షల రకాల జీవరాశులతోను,ఒక్కొక్క రకానికి కోటానుకోట్లుగా రూపములు ధరించి ఆయా రూపనామమునకు తగినట్లుగా నటించు ఆ నటనా సార్వభౌముడైన వాడెవ్వడు?మనమున్ను చేయు ఇష్ట కామ్యఫలసిద్ధికై గాని,లేదా,మోక్షమునకైగాని,దేని గురించైనాసరే సాధనప్రారంభించుటకు ముందుఈ ప్రశ్న ఎవరికి వారే ప్రశ్నించుకొందుముగాక.ఇది మన భవిష్య త్కార్యక్రమమునకు తోడ్పడుతుంది.ఇక్కడనుండి సాధకుని "ఆత్మాన్వేషణ"ప్రారంభమౌతుంది.అదే భగవద్దర్శనమునకై అన్వేషణ యనబడును.ఇష్ట కార్య సఫలతను పొందుటకు వెళ్ళవలసినమార్గము,చేరవలసిన గమ్యము ,పొందవలసిన ఫలము ,ఇవన్ని ఇక్కడ నిలబడి ఆలోచించాలి.

బజారులో ఒక్కొక్క దుకాణంలో ఒక్కొక్కరకమైన వస్తువులే దొరుకుతాయి.ఉదాహరణకు పువ్వులకొట్లో కి వెళ్ళి కట్టె లడిగితేదొరకవు గదా. అలాగే వివిధవస్తువుల భండార్ అనేదిఒకటిఉంటెఅక్కడసర్వవస్తువులులభించునన్నమాట.యికనాలుగువస్తువులకినాలుగుదుకాణములగుమ్మాలెక్కి దిగవలసిన పనిలేదుగదా.అటులనే  నానా రకాలైన మతాలు,నానారకాలదైవములు,యివన్నీదుకాణాలనిపించుకుంటాయి.  వీట్లలో ఒక్కొక్క వస్తువు మాత్రమే దొరుకుతాయి.కాని అన్ని వస్తువులకు నిలయమైన,అన్ని మత,సిధ్ధాoతములధ్యేయమైన,దైవమేదైతేయున్నదోఅట్టి దేవాదిదేవుణ్ణి చేరుకోడానికి ప్రయత్నించాలి.  .అట్టి మార్గములో పయనించి పరమాత్మను  దర్శించి బంధనివృత్తి అనెడి మోక్షానందఫలమును పొంది అనుభవించాలి.ఆ గమ్యము చేరిననీవువివిధవస్తుభండార్  అనే సర్వ వస్తుప్రాప్తానందస్ధితినిపొందిఆనందించగలవు.

అట్టి ఆనందస్ధితినే "బ్రహ్మానందం,పరమసుఖదo "అని చెప్పబడినది.ఆ స్ధితికై ఫలమునిచ్చు దైవము సర్వ శరీరములనే వివిధ వేషము ధరించి,తాను తానైవుండి  ఆ యా  దేహమునకు తగినట్లుగా నటించుచున్నవాడు నటులలోకెల్లశ్రేష్ఠుడు అయిన ఆత్మశక్తియే .కాన ఆత్మశక్తిని తెలుసుకొని దానిని పొందుటకు చేయు ప్రయత్నము నిజమైన ప్రయత్నము.అందుకే గజరాజు చాల తీవ్రముగా తన్ను తాను ప్రశ్నించుకున్నాడు.నర్తకుని భంగి పెక్కగు మూర్తులతోనెవ్వడాడు "అని.

              ఇక ఆత్మశక్తిని తెలుసుకొనియింత అంతియనిగాని చెప్పడానికి,వర్ణించడానికి,ఇది,అది,యనిగాని,చూపడానికి సాధ్యపడేదిగాదు.అది ఎంతటివారైనసరే --మునులుగాని,వేదవేదాంగ పండితులకు గాని అసాధ్యమే!మరెలా?గురువు చూపిoచడా?అని ప్రశ్నించుకొంటే గురువు కేవలము  గురుతు మాత్రమె చూపగలడు.అంటే తాను వెళ్ళుమార్గమునుచెప్పగలడుగానిదానిగూర్చిచెప్పుటకధికారము లేదు. చేప్పాలనుకున్నా అక్షరమాల సరిపోదు.ఆత్మను గూర్చి సరిగ్గా తెలుసుకుంటే యిక వాడు చెప్పవలసినది లేదు.చేయవలసినదేమియులేదు. అవధులు దాటిన అవధూత యగును. .అట్టివానికి దైవపిచ్చి తప్ప అన్యపిచ్చిలేదు.ఆ స్ధితిలో వారు సర్వస్వతంత్రులు.చెప్పవలసినది,చేయవలసినది అనే బంధము బాధ్యత వారికి లేవు.ఉండవు.ఇదే జీవన్ముక్తస్ధితి అనగాజీవించియుండగానే(శరీరములోయుండగానే)ముక్తిని అనుభవించుట.జ్ణాన నేత్రము గలవాడు,మాత్రమే చూడగలడు.గ్రహించగలడు .అనుభవించగలడు..అని భగవానుడే చెప్పెను.అయినా సాధకులుఉత్సాహములో సాధన చేయమని,అది చాలా అసాధ్యమైనదని చెప్పబడినది.అందుకే గజేంద్రుడు మునులు,పండితులు సైతం ఎవనిగూర్చి సంపూర్ణంగా కీర్తింపజాలరో అట్టి వానిని శరణు .జొచ్చెదనని చెప్పెను.

ఎవ్వని వర్తనమొరులెరుగరో?.అంటాడు గజేంద్రుడు.నానా విధములైన ,నానారకాలైనఅనేక విధములగు రంగులు,వాసనలు కల పువ్వులన్నియు ఒకానొకదానిపై ఆధారపడి "మాల"గా రూపు ధరించుచున్నది.మాలకు ఆధారము దారము కంపించదు.అటులనే సమస్త జీవరాశులు,పంచ భూతములు అనే పువ్వులు "ఆత్మశక్తి"అనే దివ్యశక్తిపై ఆధారపడిప్రపంచాన్ని మాలగా రూపు దాల్చినది.ఎవ్వరును ఆ శక్తిని మాంసపు కన్నులతో సద్గువు సాయము లేనిదే చూడలేరని పోతన పై పద్యము ద్వారా మనకు తెలియజేసినాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి