27, జనవరి 2017, శుక్రవారం

లాలిపాట

                                 లాలిపాట 

   జో అచ్యుతానంద జోజో ముకుంద
   రావె పరమానంద రామగోవింద .

  నందునింటను జేరి నయము  మీరంగ 
   చంద్రవదనలు నీకు సేవ చేయంగ 
   అందముగా వారిండ్ల ఆడుచుండంగ
   మందలకు దొంగ మా ముద్దురంగ 
   అంగజుని గన్న మాయన్న యిటు రారా 
  బంగారు గిన్నెలో పాలు పోసేరా
  దొంగ నీవని సతులు పొంగుచున్నారా 
   ముంగిటనాడరా --మోహనాకార 
   గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి 
   కావరమ్మున నున్న కంసు పడగొట్టి 
   నీవు మధురాపురము నెల చేపట్టి 
   ఠీవితో నేలిన దేవకీ పట్టి 
   అంగుగా తాళ్ళపాక న్నయ్య చాల 
  శృంగార రచనగా చెప్పే నీ జోల 
  సంగతిగ సకల సంపదల నీ వేళ
  మంగళము తిరుపట్ల మదనగోపాల   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి