(contd )
అచ్చే ద్యో య మదాహ్యోయమక్లేద్యో శోష్య ఏవ చ,
నిత్యస్సర్వగతః స్ధాణు అని చెప్పుచున్నది.సనాతనః
జీవాత్మ కత్తి మున్నగు వానిచే నరకబడడు.జీవుని అగ్నిచే కాల్చుటకును,నీటిచే తడుపుటకును,గాలిచే నార బెట్టుటకునుశక్యముగాదు.గీతజీవుడునిత్యుడు,సర్వగతుడు,స్ధాణువు,చలనములేనివాడు,సనాతనుడు అని చెప్పుచున్నది..
అనాదిగా సంక్రమించిన అజ్ఞానము అవిద్య యనబడును.అవిద్యచే ఆవరించబడిన జీవుడు సంసారములోతగుల్కొనిజననమరణములకులోనగుచున్నాడు. అట్టివాడు తన దివ్యత్వమును మఱచినాడు.జడమైన శరీరమున ప్రవేశించి చావు పుట్టుకలకులోనైనాడు.కామక్రోధాదులాతనిని బాధించుచున్నవి.అవిద్య ఎట్లు జీవునిని లోబరచుకొంది ఎవరికినితెలియదు.కానిదానినిజ్ఞానముచేతొలగించుకోనవచ్చును. జ్ఞానసంపన్నుడైన జీవుడు దేవుని సన్నిధికి జేరును.ఆ పై సంసారమతనిని బంధింపదు.దీనిని బట్టి చూడగా అవిద్యకు లోనైనవారు బద్ధజీవులనియు, దానినుండి విడివడినవారుముక్త జీవులనియు చెప్పుటకు సందేహ పడనవసరము లేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి