15, జులై 2016, శుక్రవారం

సుజనుడు

                          సుజనుడు 
సుజనుడు (విద్వాంసుడు,పండితుడు,జ్ఞాని )
సాధారణముగా విద్వాంసులుఏమహారాజునో ఆశ్రయించి తమ పాండిత్యాన్ని ప్రదర్శించి ఆ రాజుచే సన్మా నితులైలోటులేకుండాజీవితం   గడిపేవారు.కాని అలా చేయుటవలన వారి కి ప్రయోజనము సిద్ధించదు.లోక స్ధితి సుస్దిరమై నిలబడటానికి విద్వాంసుల ప్రవర్తన కారణ భూ భూతమవుతుంది.ఎందువలనంటే మెలిగే తీరు వారికి బాగా తెలుస్తుంది. వీరి పద్ధతి ఇలా ఉంటుంది.మంచివారి సహవాసం పట్ల ఆసక్తీ ,గుణవంతులవారి పట్ల అనురాగము,గురువులు-పెద్దలపట్ల అణకువ,విద్యా ర్జనయందుఆసక్తీ ,దైవభక్తి,దుష్టులకు దూరంగా ఉండడం ఉత్తములలక్షణము. వీరిహస్తాలకికంకణాల క్కర లేదు. సత్పాత్రులకు దానము చేయడమే వారికికంకణాలు.సత్యభాషణము,పరాక్రమము,శాస్త్రశ్రవణము,సత్ప్రవర్తన,నిగర్వము,ఇతరులకు తాను  చేసినఉపకారమును తానెవ్వరికి చెప్పకుండుట,ఇతరులపనులుచక్కదిద్దడము,
వీరుకొబ్బరికాయలవలెకనబడుదురు.బంగారపు కుండవలె విడ దీయుటకువీలులేనివాడును, తిరిగిశీఘ్రముగా కూర్చుటకుతగినవాడును ఐయున్నాడు. ఇట్టిసహజ గుణాలు కలవారు లోకములో బాగా గౌరవింపబడతారు.మనము గూడా అట్లుండుటకు ప్రయత్నము చెయ్యాలి.
                        *****

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి