15, జులై 2016, శుక్రవారం

మూర్ఖుడు

                          మూర్ఖుడు 
       అన్నివిధాలతెలిసినవారుఎప్పుడునుఅసూయతో నుంటారు. ప్రజా పాలకులె ప్పుడు గర్వము.అధికారము వల్లవచ్చిన మదముచేత ప్రజల బాగోగులనుచూడకవారిని బాధలు పెట్టుచుతమఅభివృద్ధినిపెంచుకొనుచున్నారు.
    అజ్ఞఃసుఖమారాధ్యస్సుఖతర
    మారాధ్యతే విశేషజ్ఞః 
     జ్ఞానలవదుర్విదగ్ధం 
     బ్రహ్మాపి నరం న రంజయతి.
అంటే ఏమి తెలియని వానికిన చెప్పచ్చు.తెలిసినవానికి కూడా చెప్పచ్చు.కాని తెలిసితెలియనివానికసలుచెప్పలేము.బ్రహ్మకుకూడాసాధ్యము కాదు.    
తెలియని మనుజుని సుఖముగ 
దెలుపందగుసుఖతరముగతెలుపగవచ్చున్ .
దెలిసినవానిం దెలిసియు 
దెలియని నరుదెల్పబ్రహ్మదేవునివశమే  
ఇంకను మొసలి నోట్లో ఉన్నమణినితీయవచ్చు కాని,భీకరమైన సముద్రాన్ని దాటవచ్చుకాని,పా మునైనాఒడుపుగాపట్టవచ్చు కాని మూర్ఖునికి  మాత్రముచెప్పలేము .
తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు 
దిరిగికుందేటి కొమ్ము సాధింపవచ్చు 
జేరి మూర్ఖులమనసు రంజింపరాదు.వీరు చేసేపనులిట్లుండును.తామరతూళ్ళకు ఉండే సన్నని నారతో  మదపుటేనుగును కట్టాలని చూడటం,దిరిసెనపువ్వుఅంచుచేత వజ్రాన్ని కోయాలని చూడటం,ఉప్పు సముద్రములోతేనె కలపాలనిచూడటం,ఎటువంటి అవివేక చర్యలో అటులనే మూర్ఖుని మనస్సును మార్చడానికి చేసే ప్రయత్నం అంత అవివేకము.మరియు  గంగ ఆకాశంబునుండి శివునితల పైకిఅక్కడనుండి పర్వతాలమీదుగా భూమిపైకి వచ్చిఅటనుండిపాతాళమునకుప్రవేశించునట్లుగామూర్ఖులు(వివేకభ్రష్టులు)వర్తనలు.నిప్పునుఆర్పడానికి నీరుఎండవేడిని తట్టుకోడానికి గొడుగు,ఏనుగును అదుపులోనుంచడానికి అంకుశముజంతువుల నుకాయటా నికి కర్ర,రోగాలు తగ్గటానికి మందులున్నాయి కాని మూర్ఖుని మూర్ఖత్వాన్ని పోగొట్టడానికి మాత్రమేమియును లేవు.మూర్ఖుడు ఎంత విద్యావంతుడైన వాని బుద్ధి మాత్రము మారదు .
ఎందువలననగా స్వభావ సిద్ధముగానే ఆవుపాలు మధురముగానే యుండును.అట్లే స్వభావ సిద్ధముగా దురాత్ముడు కూడా మారడు.
*శోక స్ధాన సహస్రాణి భయస్ధానశతానిచ 
దివసే దివసే మూఢ మావింశతి న పండితమ్ .
ప్రతిరోజూవేలకొలదిదు:ఖకారణములు,వందలకొలది భయకారణములు మూర్ఖునకుమాత్రమే కలుగుచుండును.మూర్ఖుడు(దుర్మార్గుడు)మట్టికుండ వలె తేలికగాదిoపదగినవాడును,తిరిగి కూర్చదగినవాడునుఐయుండును.మూర్ఖులుభయమువలన,,ఆశవలననుకలియుదురు.రేగుపండు వలె కనబడుదురు.   (హితోపదేశము , భర్తృహరి సుభాషితములు --ఆధారగ్రంధములు  ) 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి