ullasam-
23, జూన్ 2017, శుక్రవారం
17, జూన్ 2017, శనివారం
యాత్ర ---షట్ సుబ్రహ్మణ్య సహిత ద్వాదశ జ్యోతిర్లింగ,శక్తిపీఠదర్శనములు
యాత్ర
21-5-12 నుండి 24-6-12 వరకు
ఈ యాత్ర కొంతమంది దాతల ప్రోత్సాహముతో,యనమండ్ర మల్లేశ్వరశాస్త్రి గారి ఆధ్వర్యమున రాష్ట్రీయ సువిధ సేవాసమితి ద్వారా చేయబడింది.శ్రీ వి.శ్యావాశ్వమహర్షి,శ్రీ సి.హెచ్.రత్నాకర శర్మ,శ్రీకే.రామకృష్ణశర్మ,పి.గణపతిశర్మ,శ్రీఎస్.భావనారాయణశర్మ,వై.ఫణికాంత శర్మ,ఉమాకాంతశర్మ,వై.శ్రీకాంత్ శ ర్మ,శ్రీఎల్.మురళీ మోహనశర్మ,శ్రీఎం.సుబ్రహ్మణ్యశర్మ ,శ్రీ సి.హెచ్.శ్రీనివాసశర్మ,శ్రీ టి.కిశోర్ శర్మ,శ్రీ కె.ఆదిత్య శర్మ,శ్రీ సి.హెచ్.శ్రీకర్ శర్మ,శ్రీ వి.భరద్వాజ శర్మ,శ్రీ కె.ఉదయ్ శర్మ,ఈ ఋత్విక్కులు పాల్గొనిరి.వీరు అభిషేకార్చనలలో అన్ని యాత్రా ప్రదేశాలలో పాల్గొని యాత్రను విజయవంతము చేసిరి.
యాత్రికులు,దాతల పేర్లు దిగువన ఇవ్వబడినవి..
1.శ్రీ సి.హెచ్.సుబ్రహ్మణ్య శర్మ2.శ్రీమతి సి.హెచ్.అన్నపూర్ణ ౩.శ్రీ ఎస్.భాస్కర్ 4.శ్రీమతి ఎస్.విజయ 5.శ్రీ ఎస్.రవికుమార్6.శ్రీమతి ఎస్.కన్యాకుమారి 7.శ్రీమతి ఆర్.విజయలక్ష్మి 8.శ్రీమతి జి.జయప్రద 9.శ్రీ టి.త్యాగారాజశర్మ 10.శ్రీమతి టి.అరుణ 11.శ్రీ జి.లక్ష్మీ నారాయణ శర్మ 12.శ్రీమతి జి.రాధ 13.శ్రీ టి.వి.ప్రసాదరావు 14.శ్రీమతి టి.అన్నపూర్ణ 15శ్రీమతి ఆర్.సీతామహాలక్ష్మి 16.శ్రీ కే.శివ శంకరరావు 17.శ్రీమతికె.సత్యవతి 18.శ్రీమతి ఎం.సూర్యమణి 19.శ్రీమతి.వై .వి.మహాలక్ష్మి 20.శ్రీమతి వై.సువర్చల 21.శ్రీమతి ఎస్.బాలామనోజ్ణ 22.చి||ఎస్.విద్యాచరణ్ 23.శ్రీమతికె.శ్రీదేవి 24.శ్రీమతి వి.రాజేశ్వరి 25.శ్రీమతి వై.నీహారిక 26.శ్రీమతి వై.సత్య27.కుమారి వై.మృణాళిని28.కుమారి కె.కిరణ్మయి 29.కుమారి ఎస్.శ్రీకరి 30.చి||కె.గణపతిశర్మ 31.శ్రీమతిటి.సత్యవాణి 32.శ్రీమతి సిహెచ్.లలితమ్మ 33.శ్రీ ఏం.సోమేశ్వరరావు 34.శ్రీ డి.మురళి 35.శ్రీమతి.ఎం.నాగమణి 36.శ్రీమతి బి.నాగకుమారి 37.శ్రీమతి వి.హరీప్రియ 38.శ్రీమతి సి.హెచ్.జయలక్ష్మి 39.శ్రీ సిహెచ్.త్రినాధకుమార్ 40.శ్రీమతి సిహెచ్.జ్యోత్స్న
వైదికసహాయకులు -శ్రీ ఎం.కె.ప్రసాద శర్మ,శ్రీ కె.సూర్యప్రకాష్
అల్లరి పిడుగులు -మైత్రేయీ,ఈశ,ఐతరేయమహర్షి
పాకశాస్త్ర ప్రవీణులు-శ్రీ యు.వెంకటరమణ ,శ్రీ సి.రమణ,శ్రీ కె.రామమోహన్,శ్రీ సి.యోగి ,శ్రీ సి.హర్ష
ఉపయోగించిన వాహనములు-మార్నింగ్ స్టార్,శాంభవి (A.C)సరికొత్తబస్సులు.-వానిని నడిపినవారు భాషా,మస్తాన్ రెడ్డి,శ్రీనివాస్,వాసు వెంకటేష్
పై మేమందరము 21-5-2012నవిజయవాడలోకలిసి రాష్ట్రీయ సువిధ సేవాసమితి కార్యాలయమునుండి యాత్ర శ్రీ ఏం.రఘునాధ్ గారిచే (శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థాన కార్యనిర్వాహణాధికారి)ప్రారంభింపజేసి రాత్రి 11-15ని||లకు బయలుదేరి గుంటూరు,వినుకొండ మీదుగా పయనించి 22-5-12 తేదీ ఉదయము 7గంటలకు జేరిభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లను సేవించి అదే రోజు రాత్రి 7గంటలకు బయలుదేరితిమి.దోనాల,ఆత్మకూరు,కర్నూలుమీదుగా ప్రయాణించి 23తేదీ ఉదయము అలంపురాక్షేత్రమునకు వచ్చితిమి.అక్కడశ్రీజోగులాంబసమేతబాలబ్రహ్మేంద్రస్వామివార్లనుసేవించి మార్గమధ్యములో.(ఓర్వగల్లు) బుగ్గారామేశ్వరస్వామివారినిమరియు(కాల్వబుగ్గ)సంగమేశ్వరస్వామిని దర్శించితిమి.రాత్రి 7 గంటలకు బయలుదేరి 24-5-12 తేదిఉదయము 10 గంటలకు శ్రీ కాళహస్తి చేరి కలహాస్తీశ్వరునిదర్శించితిరుత్తణివెళ్ళిసుబ్రహ్మబ్రహ్మణ్యేశ్వరునిదర్శించిరేణుగుంట మీదుగా కంచిచేరివిష్ణుకంచిలోకంచికామకోటి పీఠాధిపతులవారిధర్మసత్రంలో బస చేసి మరునాడు శివకంచి కామాక్షీదేవి,ఏకాంబరేశ్వర స్వామీ,కామకోటి పీఠాథిపతులవారి దర్శనము అరుణాచాలక్షేత్రమువచ్చి 25 న అక్కడనుండి రాత్రి బయలుదేరి తిమి.
క్రిందివిధముగా మా ప్రయాణము సాగినది.
తేదీ చూచిన ప్రదేశములు
26 -5-12 ----చిదంబరంలో నటరాజస్వామి,వైదీశ్వరంలో అంగారకస్వామి,వైదీశ్వరస్వామి,స్వామిమలైలో సుబ్రహ్మణ్య స్వాముదర్శనం,తంజావూరు క్షేత్రంలో బృహదీశ్వరా స్వామి వారి దర్శనం
27-5-12 ---రామేశ్వరం లో పర్వత వర్ధినీ సమేత రామనాధ స్వామివారి దర్శనం ధనుష్కోటి నవపాషాణ దర్శనం
28-5-12 ----తిరుచ్చoదూరు,త్రిపురగుండం,అలగారుకోయల్ క్షేత్రాలలో సుబ్రహ్మణ్య స్వామి వార్లను 29-5-12 చూచిపళనిచేరి,సుబ్రహ్మణ్యస్వామి వారిని దర్శించి శ్రీ రంగం లోరంగనాధుని దర్శించి జంబుకేశ్వరం లో నుండి రాత్రి పది గంటలకుబయలుదేరిచాముండేశ్వరి కొండ,మదనపల్లి,సంగారెడ్డి శంకరంపేట,షోలాపూర్ మీదుగా
1-6-12 న కొల్హాపూర్ చేరితిమి. భీమేశ్వర స్వామిని చూచితిమి
2-6-12 కొల్హాపూర్ నుండి భీమశంకరం వచ్చి త్య్రంబ కేశ్వరస్వామినిద ర్శించి
3-6-12 నత్య్రంబక క్షేత్రములో ఘృష్మేశ్వర క్షేత్రంలో . ఘృష్మేశ్వర స్వామినిదర్శించి ఎల్లోరాగుహలకు వెళ్ళి చూచి సోమనాధ్ కి బయలుదేరితిమి. 5-6-12న సోమనాధ్ చేరిసోమనాధుని దర్శించి . హరిణా,కపిలా,సరస్వతీ నదుల సంగమం చూసి,నాగనాధ్ వెళ్లితిమి.
6-6-12 -సోమనాధుని దర్శించి గోమతిద్వారకలో ,భేటీ ద్వారకలో కృష్ణుని ఛోటిల్లా క్షేత్రమునకువెళ్ళితిమి.
7-6-12 -చండీ,చాముండీఅమ్మవార్లను దర్శించి ధాకోర్ క్షేత్రములో కృష్ణుని చూచితిమి.అక్కడ నుండి
8-6-12 -ఓంకార్ క్షేత్రంచేరి ఓంకారేశ్వరస్వామినిదర్శించి అమలేశ్వరస్వామిని దర్శించిఉజ్జయినికి బయలుదేరి
9-6-12 నమహాకాళేశ్వరస్వామి ,మహాకాళీ,హరసిధ్ధిమాత, కాలభైరవస్వామి, సాందీపని ఆశ్రమము,విశ్వామిత్రుని గుహలు,నాగచండీశ్వరదర్శనము కలిగినవి.అట నుండి హరిద్వార్ నకు ప్రయాణించి
11-6-12 నకుచేరిమానసాదేవి,చండీదేవి,మాయాదేవి,దక్షయజ్ఞం ల దర్శనములైనవి ,అక్కడనుండి కేదారనాధ్ నకు ప్రయాణమైరాంపురం మీదుగా
13-6-12నకేదార నాధ్ చేరి కేదారేశ్వర స్వామిని దర్శించి బదరీనాధ్ క్షేత్రమునకుబయలుదేరితిమి.
14-06-12 రాత్రి బయలుదేరి 15-06-12 ఉదయము బడరినాద్ చేరిబదరీనాధునిదర్శించి అచటనే ఉన్న బ్రహ్మకపాలమున పితృ తర్పణము జేసి ఆ రోజు రాత్రి బయలు దేరితిమి.
15-06-12 న హరిద్వార్ చేరి 16-06-12 న రాత్రిబయలుదేరి 17-06-12 నైమిశారణ్యము గుండా
18-06-12 న అయోధ్య చేరితిమి.రాములవారి దర్శనము చేసుకొని బయలుదేరి అల్హాబాదునకు చేరి మాధవేశ్వరస్వామిని దర్శించి వారణాసికి బయలుదేరితిమి.
19 -06-12 కాశీ చేరి విశ్వేశ్వరుని దర్శించి గయకు బయలుదేరి
20 -06-12 న చేరి మంగళగౌరి,విష్ణుపాదము,వట వృక్షం లనుదర్శించి పితృ తర్పణములనొనర్చి వైద్యనాద్ బయలుదేరితిమి.
21-06-12 న వైద్యనాధుని దర్శించి జాజిపూర్ నకు బయలు దేరితిమి.
22-06-12 న రాతికి చేరి గిరిజాదేవి దర్శనము జేసుకొని అరసవిల్లికి బయలుదేరి
23-06-12 న చేరి సూర్యనారాయణ దర్శనముజేసుకొని శ్రీ కూర్మము వెళ్లికూర్మావతార దర్శనము చేసుకొని సింహాచలము వెళ్లి నృసింహ స్వామిని దర్శించి
24-06-12 న పిఠాపురంవచ్చి కుక్కటేశ్వరస్వామిని దర్శించి ద్రాక్షారము జేరి భీమేశ్వర స్వామిని సేవించి కోటిపల్లి రేవులో అవబృధ స్నానముచేసి రాత్రి 10 గంటలకు విజయవాడకు బయలు దేరితిమి.ఈవిధముగా మా యాత్ర సమాప్తమయినది.
15, మే 2017, సోమవారం
వంశక్రమము
వంశక్రమము
తాతపూడి వారిది
గోత్రం-వశిష్ఠ గోత్రం
ఋషులు --1.వాశిష్ఠ 2.మైత్రావరుణ ౩.కౌండిన్య
కొంతమంది వాశిష్ట,ఇంద్ర,ప్రమద త్రయా రుషేయం అని కూడా చెప్పుచున్నారు.
గ్రామము-మంచిలి పశ్చిమ గోదావరిజిల్లా .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము .
నాకు తెలిసినంతవరకు ఇక్కడ కొన్ని విషయాలను పొందుపరచుచున్నాను.
చిట్టివేంకటేశ్వర్లు,వెంకమ్మగార్లకుసుబ్రహ్మణ్యంగారు జన్మించిరి .వారికి జగదాంబ గారితో వివాహమైనది.వారికి సత్యనారాయణ అను కొమరుడు కలిగెను .వారికి భార్యగా వెలగదుర్రు గ్రామనివాసియైన భాస్కరంగారికొమరితయగు వెంకటరత్నంగారు వచ్చిరి.వారికి భాస్కరుడు,రాజ్యలక్ష్మి (పిచికమ్మ),పొట్టమ్మ అను వారిసంతానం.భాస్కరం భార్యసూరమ్మ-వారిసంతానం -సత్యనారాయణ,వెంకటేశ్వర్లు ఇద్దరుకుమారులు.
సత్యనారయణ భార్య రమాదేవి .వెంకటేశ్వర్లుభార్య పేరు వెంకటరమణ -వారి సంతానము-సాయిభాస్కర్,సత్యవతి సుబ్రహ్మణ్యంగారు తన భార్యయగు జగ్దాంబగారు గతించిన తరువాత వేంకటరత్నం గారితో వివాహమైనది.వార్కి నలుగురు కొడుకులు,ఒక కుమార్తె కలిగిరి.
ప్రధమకుమారునిపేరుమృత్యుOజయ(ముత్తన్న) వారిభార్య లక్ష్మమ్మ .వీరు దత్తతకు వెళ్ళినారు.సంతానము కలుగలేదు.అల్లంరాజు సత్యనారాయణను దత్తత తీసుకొ ని మల్లి అను ఆమెతో వివాహము చేసిరి.వారికి కూడా సంతానము కలుగ లేదు.
ద్వితీయ కుమారునిపేరు -సూర్యనారాయణవారిభార్య మంగమ్మగారు .వీరు ప్రస్తుతము జీవించియున్నారు .వారి సంతానము-విజయలక్ష్మి,రేణుకాదేవి,ప్రసాదు అను కొడుకు కలిగెను కాని అతడు చిన్నతనానగతించెను.
విజయలక్ష్మికికోటబాలకృష్ణమూర్తిగారితోవివాహమయ్యెను,వారిసంతానము,బుజ్జి,రాణి,సౌజన్య అను నల్గురు కుమార్తెలువారందరికీ వివాహములైనవి.సంతానములు కల్గియున్నారు.
రేణుకాదేవికి రావూరి విజయ గోపాలకృష్ణమూర్తి తో వివాహము జరిగెను.జ్యోతి,మురళి,సూరిపండు,రాధ అను వారలు వారి సంతానము.సూరిపండు తప్ప మిగిలిన వారికి వివాహములైనవి. జ్యోతిభర్తఇటీవలమరణించెను.వారిసంతానము సాయి,శ్రీనిధి .
మురలిభార్యపేరు శాంత వారికి ఇద్దరు కొడుకులు(కార్తీక్ ,సూరిపండు). రాధకు ఇద్దరు పిల్లలు.వారు దుబాయ్ లోనున్నారు.
తృతీ య కుమారుడు రామమూర్తి మొదటిభార్య జగదాంబ వారిసంతానము విష్ణుప్రసాదొక్కడే అతనికి రాధ,కిశోర్ అనువారు పిల్లలు.రాధకు వెంకటేశ్వర్లుతో వివాహముజరిగెను.వారికి శరత్ ఒక్కడే కొడుకు.కిషోర్ భార్య ప్యారీ.వారు శరణ్య అను అమ్మాయిని దత్తత తీసికొ నిరి.ఇక రెండవ భార్య సత్యవాణితో వివాహమైనది.వారికి సూర్యనారాయణ,రత్నం,సుబ్బయ్య,శ్రీనివాస్,గోపాలుడు అనువారిసంతానము.సూర్యనారాయణ భార్య మహాలక్ష్మి.వారి కి రామకుమార్,సందీపకుమార్ అను ఇద్దరు కొడుకులు.రత్నం భర్త కాకరాలనాగేశ్వరరావు.వారికి నీహారిక,ఆదిత్యవారిసంతానం.హారికకుయనమండ్ర అమరకాంతతోవివాహమైనది.ఇద్దరుపిల్లలు(మైత్రేయి,ఐతరేయమహర్షి).ఆదిత్య భార్య పేరు సువర్చల భావజ్ఞ ,మనోజ్ఞ,అని ఇద్దరుపిల్లలు.సుబ్బయ్య భార్య పేరు వల్లి వారికి శ్రీకర్,శ్రీధర్,అని ఇద్దరు పిల్లలు. శ్రీనివాస్ భార్యపేరుప్యారీ.శ్రీనివాస్ఇద్దరుపిల్లలను(ప్రేమచoద్,సంత్ చరణ్ )కనిగతించెను.వీరుఇంజనీరింగ్ చదువు చున్నారు. గోపాలుని భార్యపేరు వాణి.వారికి ఇద్దరుపిల్లలు.(శ్రీ వివేక్,అభిషేక్ )వీరు వేదపఠనము చేయుచున్నారు.
సుబ్బయ్య గారి నాల్గవ కుమారుడు కృష్ణమూర్తి..వారి భార్య కామేశ్వరి.వారికి సుబ్బయ్య,పద్మ,శేషు,శంకర్,రామకృష్ణ అను వారి సంతానము.సుబ్బయ్య భార్య కామేశ్వరి.వారికోకమనుమరాలున్నది.కొడుకున్నాడు.పద్మ,శేషులకు వివాహములైనవి.పిల్లలు గలరు.శంకరము భార్యకళ్యాణి మణికంఠ,సుధవారి సంతానం.రామకృష్ణ భార్య పార్వతి.ఫణికృష్ణదత్తు,కామేశ్వరి వారి సంతానము.
సుబ్బయ్య గారి ఏకైక కుమార్తె సీతామహాలక్ష్మికి రావూరి సత్యనారాయణతో వివాహమైనది.వారిసంతానం విజయ గోపాల కృష్ణమూర్తి ,సూర్యనారాయణ,జనకమ్మ .వీరిలో జానకమ్మ చిన్నతనాన గతించినది. .గోపాలకృష్ణమూర్తి గూర్చి సూర్యనారాయణగారి వద్దచెప్పబడినది.సూరికి సుబ్రహ్మణ్యేశ్వరితో వివాహమైనది.వారికి విశ్వనాధం,సీతామహాలక్ష్మి అని ఇద్దరు పిల్లలు.విశ్వనాధంభార్య సౌజన్య,సీతామహాలక్ష్మి భర్త హరి.వారిరువురికి చెరొక కొడుకు గలరు.
@@@@@@@@@@@@@@@
కవితావైచిత్రి
క్రింది పద్యమును పరికించoడి
వంగతోట నుండు వరిమళ్ళలో నుండు,
జొన్న చేలనుండు చోద్యముగను ,
తలుపు మూలనుండు తలమీద నుండు
దీని భావమేమి తిరుమలేశ?
1.వంగతోటలోను,2.వరిమళ్ళలోను,3.జోన్నచేలలోను,4.తలుపు మూలలోను,5.తలమీదనుకూడచోద్యముగానుండు నవి ఏవి?--అను ఈ ఐదు ప్రశ్నలు మొదట భ్రాంతిని కల్గించి చిత్తాన్ని చిక్కుల్లోకి తోసివేస్తున్నాయి.
29, ఏప్రిల్ 2017, శనివారం
భారతదేశపు రాజచిహ్నము
భారతదేశపు రాజచిహ్నము
భారతదేశపు రాజచిహ్నమైన నాలుగు సింహాలముఖములు కలిగిన ముద్ర నాలుగుసత్యాలను సూచిస్తాయి.
1.లోకంలో దుఃఖం ఉంది. 2.దుఃఖానికి కారణముంది. ౩.దుఃఖాన్ని దూరం చేసుకోవచ్చు. 4.దుఃఖాన్ని తొలగించుకోవటానికి మార్గముంది.జాతీయ జెండా లో అశోక చక్రం కన్పిస్తుందిఆ అశోకచక్రంలో 24 దళాలు కన్పిస్తాయి.1.ప్రేమ 2.ధైర్యం ౩.సహనం 4.శాంతి 5.కరుణ 6.మంచితనం 7.విశ్వాసం8మృదుత్వo 9.సంయమనం10.త్యాగనిరతి.11.ఆత్మార్పణ.12.నిజాయితీ 13.సచ్ఛీలత 14.న్యాయం 15.దయ 16.హుందాతనం 17.వినమ్రత 18.సహానుభూతి 19.జాలి 20.చెడు చెయ్యాలంటే భయం 21 .సరైనజ్ఞానం22 .చక్కనిఅనుభవజ్ఞానం23.మంచినీతి24.లోకంమంచితనంపైన. మ్మకం,విశ్వాసం,ఆశ.
పై 24 భావాలు మానవుని మహనీయునిగారూపుదిద్దుతాయని మహానుభావులచే అశోక చక్రం తయారు చేయబడినది.ఇవి భారతీయుల రక్తంలో అంతర్లీనంగా నున్నాయి.
7, ఏప్రిల్ 2017, శుక్రవారం
అన్న దాన మహిమ
అన్నదానము
పూర్వము జనాభా తక్కువగా నుండుట చేతను,మానవులలో పాపభీతి, దైవభక్తి,ఏకాగ్రత,మున్నగు సుగుణములుండుటచేకీర్తి కాముకులై దానగుణముకలిగియుండెడివారు.అన్నికులాలవారు కొద్దో,గొప్పో దానాలు చేసేవారు.బలి,కర్ణుడు,శిబి మున్నగు వారినిఉదాహరణగా గ్రహించవచ్చును.దానాలలో అన్నదానముపూర్వము నుండి ఇప్పటివరకు అనేక ఉత్సవాలలో అన్నదానము చేయుచుండుట జరుగుచున్నది.ఉత్తమ గ్రంధమైన రామాయణములో రాముడు అరణ్యవాసానంతరము పట్టాభిషిక్తుడైన హనుమంతునిని బీదసాదలకు దానం చేయమని యాదేశించినాడట.ఎన్నోదినాలు,ఎంతోఉత్సాహముతో,అన్నవస్త్రాలు దానము చేసినా అన్నమో రామచంద్రా,ఆలో లక్ష్మణాఅంటూ వచ్చిన జనం మాత్రం తగ్గలేదట.అలసిన హనుమానుడు మాత్రం వచ్చిన వాళ్ళను తర్జిస్తూ,భర్జిస్తూ,ఏ కొద్దో,గొప్పో వారి ముఖాన విసరడంతో,క్రమంగా అర్ధి జనులు ఆగిపోయారుట.దీనికిష్టపడనిరాముడోకనాడు నగరంలో తిరుగు చుండగా ,త్రోవలో ఒకవంకరమూతిగల సన్న్యాసి ఎదురు పడిన వానికి నమస్కరించి మహానుభావా!అంటా బాగానే యుంది నీకు ఆ పంది మూతిఎలావచ్చింది అనిఅడిగెనట.అప్పుడాతడుక్రింది విధంగా చెప్పెనట.
శ్లో|అన్నదానం మయా దత్తం రత్నాని వివిధానిచ
నదత్తంమధురై ర్వా క్యై :తే నాహం సూకరాన్వయ :
ఓ రామా!పూర్వజన్మలొ నేనెన్నో అన్నసంతర్పణలు చేసాను.కాని ఆ చేసే దానం భక్తిశ్రద్ధలతో,వినయవిధేయతలతో ,మంచి మాటలతో చేయలేదు.అందుచే ఈ జన్మలో నా మూతి పంది మూతి యైనది.అని చెప్పెను.దానిని రాముని వెంతయున్న ఆంజనేయుడు విని అందులోని పరమార్ధాన్ని గ్రహించి ప్రియంతోపలుకుచు భక్తితో దానం చేయడం మొదలు పెట్టాడు.దీని వలన అన్నదానమహిమ ఎంతగొప్పదో మనము గ్రహించవలెను.
6, ఏప్రిల్ 2017, గురువారం
అత్తారిల్లు
అత్తారిల్లు
అత్తారిల్లుఅంటేచాలామందికియిష్టముగను,యిష్టముగను,భయంగాను కనబడుతుంది.చాలామంది తమభార్యలపై ప్రేమతో అత్తవారింటఉండటానికి సిధ్ధ.మౌతారు.అట్టివారు తమ అభిప్రాయాలను క్రింది శ్లోకంలో తెలియ బరచినారో గమనించండి..
శ్లో.శ్వశురగృహనివాసఃస్వర్గతుల్యోనరాణాం
యదిభవతిరిద్రో పంచవాషడ్దినాని
దధి మధు ఘృత లోభాత్ మాసమేకం .వసేత్ చేత్ తదుపరి దినమేకం పాదరక్షా ప్రయోగః
అత్తవారిల్లు ఎట్టిది?అను ప్రశ్నకు సమాధానము పై శ్లోకంలో దర్శనీయమగు చున్నది.
ఒక మామ గారింట్లో నల్గురుఅల్లుళ్లు ఉన్నారు.ఒకేసారి మను గుడుపు (వివాహానంతరం అత్త వారింట్లోఅల్లుళ్ళకుచేసేవిందు) ల కోసం వచ్చినారట.ఎంతధనం, ఓపిక,ప్రేమ గలవారైనా ,ఎంత బాగా పెట్టాలనుకున్నా ,ఎంతకాలమని ,అల్లుళ్ళకు తినుబండారాలు,సేవలు చేయగలరు?వారికి మాత్రము విసుగు పుట్టదా?ఇలా ప్రతిదినం పీకలవరకుమెక్కి ,మేలమాడుకుంటున్న సమయంలో ఒకరికి బుధ్ధి వచ్చి ,అత్తవారిల్లు అన్నీ విధాలా స్వర్గసుఖాలలో ఓలలాడి స్తుంది అనే అర్ధం వచ్చు పై శ్లోకంలోని ప్రధమపాదo అత్తవారింటగోడపై వ్రాసి వెళ్ళేనట. .మరి కొన్ని రోజులకు రెండవ వానికి బుధ్ధి వచ్చి ,అత్త వారిల్లు ఎంత స్వర్గసీమయైన 5,6రోజులకంటే మించి యుండరాదను అర్ధము వచ్చేటట్లు రెండవపదాన్ని గోడపై వ్రాసివెళ్ళేనట.
మరికొన్ని రోజులు మెక్కి అజీర్ణం తెచ్చుకొన్న మూడవ వాడుఅత్తవారింటఅనాయాసంగాపెరుగు,పాలు,పిoడివంటలు వడ్డిస్తున్నారను అర్ధము వచ్చేటట్లు మూడవపాదాన్ని వ్రాసి మాయమైనాడట.ఇక నాలుగవవాడు మాత్రం,తిని,తేపి , వారిమీద పెత్తనం కూడా చేస్తూ ,అవి కావాలి,ఇవి కావాలి అని అధికారం చెలాయించడంతో ,పాపం ఎంత బావమరుదులైన ఏమి చేస్తారు?ఎంతకాలమని భరిస్తారు? ఏమి చేయునది లేక కోపముతోచెప్పుతో నెత్తి మీది బొచ్చు ఊడేటట్లునాలుగు దెబ్బలుకొట్టారట.దానితో ఆ నాలుగవవాడు పారిపోతూ,ఆదర బాదరగా తిండి మీది ఆశతో నెలల తరబడి తిష్టవేస్తే ,ఆ తర్వాతచెప్పు దెబ్బలు తప్పవు అనే అర్ధం కల నాల్గవ పాదం వ్రాసి పారిపోయాడు.
దీనినిబట్టి ఎంత ఆశపోతు,attతిండిపోతులైనా, అత్త వారింట్లో ఎక్కువ రోజులుండరాదని భావం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)