29, ఏప్రిల్ 2017, శనివారం
7, ఏప్రిల్ 2017, శుక్రవారం
అన్న దాన మహిమ
అన్నదానము
పూర్వము జనాభా తక్కువగా నుండుట చేతను,మానవులలో పాపభీతి, దైవభక్తి,ఏకాగ్రత,మున్నగు సుగుణములుండుటచేకీర్తి కాముకులై దానగుణముకలిగియుండెడివారు.అన్నికులాలవారు కొద్దో,గొప్పో దానాలు చేసేవారు.బలి,కర్ణుడు,శిబి మున్నగు వారినిఉదాహరణగా గ్రహించవచ్చును.దానాలలో అన్నదానముపూర్వము నుండి ఇప్పటివరకు అనేక ఉత్సవాలలో అన్నదానము చేయుచుండుట జరుగుచున్నది.ఉత్తమ గ్రంధమైన రామాయణములో రాముడు అరణ్యవాసానంతరము పట్టాభిషిక్తుడైన హనుమంతునిని బీదసాదలకు దానం చేయమని యాదేశించినాడట.ఎన్నోదినాలు,ఎంతోఉత్సాహముతో,అన్నవస్త్రాలు దానము చేసినా అన్నమో రామచంద్రా,ఆలో లక్ష్మణాఅంటూ వచ్చిన జనం మాత్రం తగ్గలేదట.అలసిన హనుమానుడు మాత్రం వచ్చిన వాళ్ళను తర్జిస్తూ,భర్జిస్తూ,ఏ కొద్దో,గొప్పో వారి ముఖాన విసరడంతో,క్రమంగా అర్ధి జనులు ఆగిపోయారుట.దీనికిష్టపడనిరాముడోకనాడు నగరంలో తిరుగు చుండగా ,త్రోవలో ఒకవంకరమూతిగల సన్న్యాసి ఎదురు పడిన వానికి నమస్కరించి మహానుభావా!అంటా బాగానే యుంది నీకు ఆ పంది మూతిఎలావచ్చింది అనిఅడిగెనట.అప్పుడాతడుక్రింది విధంగా చెప్పెనట.
శ్లో|అన్నదానం మయా దత్తం రత్నాని వివిధానిచ
నదత్తంమధురై ర్వా క్యై :తే నాహం సూకరాన్వయ :
ఓ రామా!పూర్వజన్మలొ నేనెన్నో అన్నసంతర్పణలు చేసాను.కాని ఆ చేసే దానం భక్తిశ్రద్ధలతో,వినయవిధేయతలతో ,మంచి మాటలతో చేయలేదు.అందుచే ఈ జన్మలో నా మూతి పంది మూతి యైనది.అని చెప్పెను.దానిని రాముని వెంతయున్న ఆంజనేయుడు విని అందులోని పరమార్ధాన్ని గ్రహించి ప్రియంతోపలుకుచు భక్తితో దానం చేయడం మొదలు పెట్టాడు.దీని వలన అన్నదానమహిమ ఎంతగొప్పదో మనము గ్రహించవలెను.
6, ఏప్రిల్ 2017, గురువారం
అత్తారిల్లు
అత్తారిల్లు
అత్తారిల్లుఅంటేచాలామందికియిష్టముగను,యిష్టముగను,భయంగాను కనబడుతుంది.చాలామంది తమభార్యలపై ప్రేమతో అత్తవారింటఉండటానికి సిధ్ధ.మౌతారు.అట్టివారు తమ అభిప్రాయాలను క్రింది శ్లోకంలో తెలియ బరచినారో గమనించండి..
శ్లో.శ్వశురగృహనివాసఃస్వర్గతుల్యోనరాణాం
యదిభవతిరిద్రో పంచవాషడ్దినాని
దధి మధు ఘృత లోభాత్ మాసమేకం .వసేత్ చేత్ తదుపరి దినమేకం పాదరక్షా ప్రయోగః
అత్తవారిల్లు ఎట్టిది?అను ప్రశ్నకు సమాధానము పై శ్లోకంలో దర్శనీయమగు చున్నది.
ఒక మామ గారింట్లో నల్గురుఅల్లుళ్లు ఉన్నారు.ఒకేసారి మను గుడుపు (వివాహానంతరం అత్త వారింట్లోఅల్లుళ్ళకుచేసేవిందు) ల కోసం వచ్చినారట.ఎంతధనం, ఓపిక,ప్రేమ గలవారైనా ,ఎంత బాగా పెట్టాలనుకున్నా ,ఎంతకాలమని ,అల్లుళ్ళకు తినుబండారాలు,సేవలు చేయగలరు?వారికి మాత్రము విసుగు పుట్టదా?ఇలా ప్రతిదినం పీకలవరకుమెక్కి ,మేలమాడుకుంటున్న సమయంలో ఒకరికి బుధ్ధి వచ్చి ,అత్తవారిల్లు అన్నీ విధాలా స్వర్గసుఖాలలో ఓలలాడి స్తుంది అనే అర్ధం వచ్చు పై శ్లోకంలోని ప్రధమపాదo అత్తవారింటగోడపై వ్రాసి వెళ్ళేనట. .మరి కొన్ని రోజులకు రెండవ వానికి బుధ్ధి వచ్చి ,అత్త వారిల్లు ఎంత స్వర్గసీమయైన 5,6రోజులకంటే మించి యుండరాదను అర్ధము వచ్చేటట్లు రెండవపదాన్ని గోడపై వ్రాసివెళ్ళేనట.
మరికొన్ని రోజులు మెక్కి అజీర్ణం తెచ్చుకొన్న మూడవ వాడుఅత్తవారింటఅనాయాసంగాపెరుగు,పాలు,పిoడివంటలు వడ్డిస్తున్నారను అర్ధము వచ్చేటట్లు మూడవపాదాన్ని వ్రాసి మాయమైనాడట.ఇక నాలుగవవాడు మాత్రం,తిని,తేపి , వారిమీద పెత్తనం కూడా చేస్తూ ,అవి కావాలి,ఇవి కావాలి అని అధికారం చెలాయించడంతో ,పాపం ఎంత బావమరుదులైన ఏమి చేస్తారు?ఎంతకాలమని భరిస్తారు? ఏమి చేయునది లేక కోపముతోచెప్పుతో నెత్తి మీది బొచ్చు ఊడేటట్లునాలుగు దెబ్బలుకొట్టారట.దానితో ఆ నాలుగవవాడు పారిపోతూ,ఆదర బాదరగా తిండి మీది ఆశతో నెలల తరబడి తిష్టవేస్తే ,ఆ తర్వాతచెప్పు దెబ్బలు తప్పవు అనే అర్ధం కల నాల్గవ పాదం వ్రాసి పారిపోయాడు.
దీనినిబట్టి ఎంత ఆశపోతు,attతిండిపోతులైనా, అత్త వారింట్లో ఎక్కువ రోజులుండరాదని భావం.
4, ఏప్రిల్ 2017, మంగళవారం
చిత్రం
చిత్రం
చిత్రం అంటే మిత్రుల మధ్య గాని ఒకరిదేగాని కావచ్చు .
శ్లో.కిం చిత్రం యది రాజనీతి కుశలోరాజా భవే ద్ధార్మికః
కిం చిత్రం యది వేదశాస్త్రనిపుణోవిప్రోభవేత్పండితః
తచ్చిత్రం యది రూప యౌవనవతీతన్వీభవేత్కామినీ?
తచ్చిత్రం యది నిర్ధనోపి పురుషః పావం న కుర్యాత్ క్వచిత్
ప్ర.1.మిత్రమా!రాజనీతిలోరాటుదేలినకొందరు,ధన,అధికార,దాహాలతో,పైకి కనబడకుండా ఎన్నో పిచ్చి పనులు చేస్తారు.అలా కాకుండా రాజనీతిలో ప్రజ్ఞాశాలియైన రాజు కూడా ధర్మాచరణలో పుణ్యా త్ముడైనచో,దానిలో ఆశ్చర్య కర విషయమేమున్నది ?
ప్ర 2.వేదశాస్త్రే తిహాసాలతో,నేతలైనఛాందస బ్రాహ్మణులు కూడా పండితులు కావటంతో పరమాశ్చర్య పద వలసిన పని లేదు. vఅంశ పారంపర్య ,సంస్కార,ప్రాంతీయ పరిస్దితులననుసరించి,త్యాగాస్దులైన ,పండిత పుత్రులైన,ఆ బ్రాహ్మణులు పాండిత్యం సంపాదించటంలో,అంట అద్భుతమేమి కనబడదు.
ప్ర౩.ఇక విచిత్రమేమిటంటే మిక్కిలి అందచందాలతో వలపు గొల్పు యువతి అగు భామిని కులటయై చెడిపోక ,భర్త ఎట్టివాడైన,విడువక పరమ పతివ్రతగా సేవించుటం,ఒక ఆశ్చర్య కర విషయమే.
ప్ర 4. అంతకన్నమరొక గొప్ప విచిత్రమేమిటంటే ,చేత చిల్లి గవ్వయైనలేని,దరిద్రదామోదరుడు,ఎంతహీనస్ధితిలోనున్న,ఎన్ని కష్టాలు ఎదురైనా,కడుపు కడివెడాకాలితో మాడుతున్నా,ఆ కూటి కోసం కోటి విద్యా ధనా వకాశాలున్నా ,అట్టి పాపకార్యాలు చేయక,నిరాడంబరంగానీతిగాజీవించడంచిత్రాతివిషయమన్నమాట.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)