26, డిసెంబర్ 2016, సోమవారం

                                                        శ్రీమదుమాచోడేశ్వరదండకం
                   శ్రీ రావూరివేంకటేశ్వర్లుగారు                     
         శ్రీ మత్కృపావార్ధి!చింతాభరస్పర్ధి!కళ్యాణభావస్ధిరాప్రేమ తత్వస్ఫుర ద్విశ్వసంచార!సారజ్ఞవేద్య ప్రకృష్టాష్ట మూర్తీ !ప్రసన్నార్తి సంహార వర్తీ! గుణస్ఫూర్తి !కైవల్య దీపా!మహా తీవ్రతాప ప్రచారాగ్ని నేత్ర!      ప్రభాతస్ఫురత్పద్మ కింజల్క  గౌరాంగ గౌరీ సమాశ్లిష్ట వామాంగ!నాగేంద్ర భూషా!సుధాధామ రేఖా ప్రభా రంగదుత్తుంగ భంగ స్ఫురద్గాంగ బిందుప్రచారోత్తమాంగా!సరోజాత పీఠాదిదేవా ర్చితాం ఘ్రి ద్వయా అద్వయా!సర్వతేజోభిరూపా!కలాకల్పనా చాతురీ వైఖరీసంగతాభంగసారస్యసంగీతశృంగారభంగీవిశేషోదయా!శేషశాయిప్రియా!భారతీకల్పితార్చాపరాసేవితా!భావితాఖండవిశ్వోదయా!యామినీసంచరద్ఘోరకృత్యప్రవిధ్వంసనాగౌతమీపూతసంజాతధారాభిషిక్తాంగ!లింగాకృతీ!దేవీపట్నస్ధవాలాద్రిరాట్ఛృoగరంగత్తటావాస!చోడాఖ్యభూభ్రుత్ప్రతిష్టాధ్య!చోడేశ్వరా!దీనరక్షా!సమర్ధా ! పరార్ధాకృతతార్ధుoడనైతిన్ భవత్సేవతో ,శంకరా!శిష్ట రక్షాకరా!దేవదేవా!నమస్తే నమస్తే నమస్తే నమః .

        శివార్పణమస్తు