27, జూన్ 2016, సోమవారం

విద్య

                          విద్య 
విద్య అనునది రెండు విధాలు.1.శస్త్ర విద్య
2.శాస్త్రవిద్య.
శస్త్రవిద్య  అనగా ఆయుధములనుప్రయోగమును తెలిపేది.
శాస్త్రవిద్య అనగా శాస్త్రములను తెలిపేది .దీని వలన జ్ఞానము ,గౌరవము లభించును.ఇట్టి విద్య గురించి హితోపదేశ గ్రంధమున ఇట్లు చెప్పబడినది .
విద్యా దదాతివినయం వినయాద్యాతిపాత్రతామ్ పాత్రత్వాద్ధనమాప్నోతిధనాద్దర్మంతతస్సుఖమ్.    అంటే విద్యవలన వినయము,వినయమువలన పాత్రత పాత్రత వల్ల ధనము ,దాని వలన ధర్మము ఆ ధర్మమువల్ల సౌఖ్యము లభించును. ఎందుచేతననగా 
సర్వ ద్రవ్యేషు విద్యైవ ద్రవ్యమాహురనుత్తమమ్

 అహార్యత్వాదనర్ఘ త్వాదక్షయ త్వాచ్చ సర్వదా. 
మరియు,
విద్యా నామ నరస్య రూపమధికం ప్రచ్చన్న గుప్తంధనం
విద్యాభోగకరీయశస్సుఖకరీవిద్యాగురూణాoగు
రు:
విద్యా బంధు జనో విదేశగమనే విద్యా పరదేవతా విద్యా రాజసు పూజ్యతే నహి దానం విద్యా విహీ నఃపశు :
పురుషునికి రూపసమానమైనది విద్య .విద్య గలవాడు అందగాడు కాకపోయినాసరే.దీనికి ఉన్న యోగ్యత ధనానికి ఉండదు.ఇట్టి విద్యను పొందనివాడు ఎక్కడను రాణించలేడు.
నవీనములోవిద్యకై విద్యనుఅభ్యసించుటలేదు. ధనార్జనకోసమే చదువుతున్నారు .అందుచేతనే కొద్దిమంది మాత్రమే రాణిoచగలుగుచున్నారు.
పైగా విద్యయే పరమాత్మ.ఈ లోకమున జీవితం గడుపుటకు విద్యయే కారణభూతమైనది.
న చో రహార్యం న చ రాజభాజ్యం,
 న భాతృ భాజ్యం నచ భారకారీ 
వ్యయే కృతే వర్ధత ఏవం 
విద్యాధనం సర్వధనప్రధానం  అనియు చెప్పబడినది.నవినమునఅది వ్యాపారవస్తువై యుండుట శొచనీయము.  అన్ని ధనాలను ఖర్చుపెడితే తిరిగిరావు కాని ఇది మాత్రము పెరుగుతుంది మనమున్నంతవరకు ఉంటుంది.విద్య నేర్చుకొని మంచిచెడులను గుర్తించి మంచిని గ్రహించి తనలోని పరమాత్మను వెదుకుకొని మోక్షమునుపొందవలయును.